ప్రముఖ కథానాయిక జాన్వీ కపూర్ – శిఖర్ పహారియా మధ్యలో ప్రేమ ఉందని ఇప్పటివరకు ఇద్దరూ ఎక్కడా చెప్పలేదు. అలా అని తమ మధ్య అలాంటి అనుబంధం కూడా లేదని చెప్పడం లేదు. అయితే ఇద్దరి మధ్యలో మంచి అనుబంధం ఉందని చెబుతూ ఉన్నారు. తాజాగా మరోసారి వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని చెప్పుకొచ్చింది. తన తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడు శిఖర్ తనకు ఎలా అండగా నిలిచాడో జాన్వీ చెప్పుకొచ్చింది. ‘కాఫీ విత్ కరణ్’ కొత్త ఎపిసోడ్‌లో వరుణ్ ధావన్‌తో కలసి జాన్వీ పాల్గొంది. అందులోనే ఈ కామెంట్స్ చేసింది.
శిఖర్ ఆ సమయంలో లండన్‌లో చదువుకుంటున్నాడు. అమ్మ చనిపోయిందని తెలియగానే తన సెమిస్టర్‌ను మధ్యలోనే వదిలేసి ముంబయి వచ్చేశాడు. నిజానికి శిఖర్ వాళ్ల నాన్న దగ్గర ఉండాలి. కానీ, నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని జుహులోని తన స్నేహితుడి ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. నెల రోజులు అక్కడే ఉన్నాడు. ఈ విషయం చాలా రోజుల తర్వాత తెలిసింది అని జాన్వీ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.
జాన్వీ, శిఖర్ పహారియా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని వారు బహిరంగంగా ప్రకటించకపోయినా, కొన్ని ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడి తమ మధ్య అనుబంధాన్ని తెలిపింది. కొన్ని రోజుల క్రితమ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రేమ సురక్షితమైన భావన. నాలో ఉన్న నిస్సహాయతను దూరం చేసింది శిఖర్ ప్రేమే. అతని దగ్గర నేను చిన్నపిల్లలా మారిపోతా. నన్ను ఎవరూ జడ్జ్ చేయరనే స్వేచ్ఛ అక్కడ ఉంటుంది అని చెప్పింది.
నాకు 16 ఏళ్ల వయసున్నప్పటి నుండి శిఖర్ నా జీవితంలో ఉన్నాడు. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉంటూ కలిసే పెరిగాం అంటూ తమ ప్రేమ ఎంత పాతదో చెప్పకనే చెప్పింది జాన్వీ. ఇన్ని విషయాలు చెబుతున్న జాన్వీ పెళ్లి ఎప్పుడు అనేది కూడా చెప్పేస్తే కుర్రాళ్లకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది.