రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ తో తెరకెక్కించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana) పై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 5న రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు. ఓవర్సీస్ కి చెందిన ఒక రివ్యూయర్ ‘రామాయణ’ చిత్రం ఇంగ్లీష్ డబ్బింగ్ 3D వెర్షన్ చూసినట్టు తెలిపాడు. అది ఒరిజినల్ హిందీ వెర్షన్ కంటే 30 నిమిషాల నిడివి తక్కువగా ఉందట.
ఇక సినిమా గురించి అతను ప్రస్తావిస్తూ.. ” సినిమాని భారీ బడ్జెట్‌తో ఎంతో కష్టపడి తీశారని, స్క్రీన్ మీద ఆ కష్టం కనిపిస్తుందని తెలిపాడు. కథ విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే తీశారట. అలాగే ఎమోషన్స్ పండించడంపై కంటే గ్రాఫిక్స్, ఫైట్స్ మీదే చిత్ర బృందం ఎక్కువ ఫోకస్ చేశారట. అందువల్ల కొన్ని చోట్ల టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగించిందట. సెకండ్ హాఫ్ ను బాగా సాగదీసినట్లు తెలిపాడు. ఫైట్ సీన్స్ చాలా సేపు ఉన్నా కూడా ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వవని తెలిపాడు. రావణాసురుడిగా చేసిన యష్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని రాసుకొచ్చాడు.
ముఖ్యంగా యష్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయిందట. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి యాక్టింగ్ పరంగా బాగానే చేసినా.. వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ లో దైవత్వం కనిపించలేదట. కొన్ని చోట్ల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, నిర్మాత పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని, కానీ కొన్ని సీన్స్ చూస్తే స్టూడియోలో గ్రీన్ మ్యాట్ ముందు తీసినట్టు ఈజీగా తెలిసిపోతుందని, కొందరు రాక్షసులు (అసురులు) అయితే కార్టూన్ బొమ్మల్లా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు వదిలాడు.
మ్యూజిక్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అని, రామాయణం (Ramayana) లాంటి కథకు మ్యూజిక్ ప్రాణం పోయాలని, దైవత్వాన్ని ఫీల్ అయ్యేలా చేయాలని,కానీ ఇందులో మన ఇండియన్ మ్యూజిక్‌కు హాలీవుడ్ స్టైల్ మిక్స్ చేయడం వల్ల అది కాస్తా రివర్స్ అయ్యిందని పేర్కొన్నాడు. ఓవరాల్ గా చిత్ర బృందం ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చని, వాళ్ళకోసమైనా కచ్చితంగా ఒకసారి చూడొచ్చని, ఈ మధ్య వచ్చిన ఇతర రామాయణ అడాప్టేషన్స్ (ఆదిపురుష్ లాంటివి) కంటే ఇది బెటరని చెప్పాడు. కానీ మొదటి నుండీ ఉన్న హైప్ ను మాత్రం ఈ సినిమా మ్యాచ్ చేయలేదని’ రాసుకొచ్చాడు ఆ రివ్యూయర్.
#Ramayana Initial Impressions:
A hugely ambitious film mounted on a grand scale, and the effort behind it is clearly visible. The team largely stays true to the Ramayana, but the film leans more on spectacle and action than drama and emotion, leaving parts of the narration feeling flat and even serial like at times. The second half also drags in places because of where Part 1 chooses to end, with limited material stretched out through lengthy action blocks that don’t create much impact
Yash as Ravana is the biggest highlight and is superb, especially in his introduction portions. Ranbir Kapoor and Sai Pallavi are solid as Ram and Sita, though the divine aura and emotional weight don’t always fully translate on screen.
The visuals are stunning in parts and the money spent is clearly visible, but some scenes still have a noticeable studio/green screen feel with a few cartoonish asuras. The biggest negative, hands down, is the music. For a story like Ramayana, the score has to carry much of the divinity and emotion, but the Indian-Hollywood blend largely backfires and ends up feeling like neither apart from a few scenes.
The ambition and scale deserve a lot of applause. Definitely watchable and better than a few recent adaptations, but it falls short of the massive expectations and ultimately feels like a mixed bag with so much more potential.
Full review with rating later in my usual style (review embargo)
— Venky Reviews (@venkyreviews) October 28, 2026