Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు ₹600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2′(Jailer 2) రాబోతున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు.

Jailer 2

‘సన్ పిక్చర్స్’ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ‘జైలర్ 2’ ప్రమోషనల్ కంటెంట్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ.. సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం వల్ల ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా బాగా క్యాష్ చేసుకుంది. మొదటి వారానికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 నైజాం  20.91 కోట్లు
 సీడెడ్  6.56 కోట్లు
 ఆంధ్ర(టోటల్)  20.85 కోట్లు
 ఏపీ +తెలంగాణా(టోటల్)  48.32 కోట్లు (షేర్)
 తమిళనాడు  78 కోట్లు
 రెస్ట్ ఆఫ్ ఇండియా  76.82 కోట్లు
 ఓవర్సీస్  91.2 కోట్లు
 వరల్డ్ వైడ్ టోటల్  294.34 కోట్లు (షేర్)

‘జైలర్ 2’ సినిమాకి రూ.281.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.285 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.36.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

అయితే 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.294.34 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.585 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.9.34 కోట్ల లాభాలు ఓవరాల్ గా అందించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.48.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.11.32 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus