Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

విజయ్‌ నిన్నమొన్నటి వరకు సినిమాల్లో స్టార్‌ హీరో. కానీ ఇప్పుడు ప్రజలు మొత్తానికి స్టార్‌ హీరో. అందుకే తమిళనాడు ప్రజలు అతని పార్టీ టీవీకేని అతి పెద్ద పార్టీగా గెలిపించారు. వివిధ కష్టాలు దాటుకొని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారాయన. ఇప్పుడు తనదైన మార్కు పాలనతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఈ సమయంలో విజయ్‌ సినిమా వస్తే, అందులోనూ ఆ సినిమా ఒక సినిమాకు ఎన్ని కష్టాలు రాకూడదో.. అన్ని కష్టాలూ ఎదుర్కొని వస్తుంటే.. కచ్చితంగా గొప్పే కదా.

Jana Nayagan

ఇలాంటి సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయడానికి చిత్రబృందం సిద్ధం చేసింది అని చెబుతున్న ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినిమాను సెన్సార్‌ చిక్కులు దాదాపు తీరిపోయాయని, జులై 24న సినిమాను రిలీజ్‌ చేసేద్దాం అంటూ నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నుండి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు సమాచారం వచ్చేసిందట. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్‌ సిద్ధం చేసి పంపారట. అందులో విజయ్‌ను ఓ సూపర్‌ పవర్స్‌ ఉన్న హీరోగా చూపించారు అని చెబుతున్నారు.

సూపర్‌ మ్యాన్‌ సినిమాలో సూపర్‌ మ్యాన్‌ నడుచుకుంటూ వస్తుంటే.. చుట్టూ ఉన్న వాళ్లు ఛాతి మీద చెయ్యేసి ధైర్యంగా నిలిచే పోస్టర్‌ గుర్తుందా. అచ్చంగా అలాగే ‘జన నాయగన్‌’పై జనాలు చేయి వేసేలా పోస్టర్‌ను సిద్ధం చేశారు. అందులో జులై 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేస్తాం అని రాశారు కూడా. మరి ఈ పోస్టర్‌ ఒరిజినలేనా? లేక ఫ్యాన్‌ మేడా అనేది చూడాలి. ఈ సినిమాను ఇటీవల సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీ ఈ సినిమాను వీక్షించింది.

కొన్ని సంభాషణలను మ్యూట్‌ చేయడంతోపాటు, కొన్ని సన్నివేశాలను తొలగించాలని చెప్పిందట. ఇవన్నీ చేసి త్వరలో సినిమాను చేయాలని అనుకుంటున్నారట. అయితే, ఈ మార్పులను సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీ చూసి ఓకే చేయాల్సింది ఉంది. దీనికిగాను జులై 16న డేట్‌గా చెప్పిందట. అంటే ఆ రోజు ఫైనల్‌ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న.. ప్రభుత్వం మీద ప్రశ్నలు వేసినట్లు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఆ సినిమా హీరో విజయ్‌ పార్టీనే. మరిప్పుడు ఏం చేస్తారు?

మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus