Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

మొన్నీమధ్య మైత్రీ మూవీ మేకర్స్‌ వారి ఓ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీల గురించి నవీన్‌ పేల్చిన పంచ్‌ అదిరిపోయింది. చాలా రోజులు సోషల్‌ మీడియాలో ఆ డైలాగ్‌ వైరల్‌గా మారింది కూడా. ఇప్పుడు అదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ రోజు అసలు నవీన్‌ ఆ కార్యక్రమానికి ఎందుకొచ్చాడు అనే ప్రశ్నకు ఇప్పుడు ఆన్సర్‌ దొరికింది కాబట్టి.

Naveen – Mythri

సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ అంటూ వచ్చి కెరీర్‌లో తొలిసారి రూ.100 కోట్ల వసూళ్లు మార్కును దాటిన నవీన్‌ పొలిశెట్టి ఆ తర్వాతి సినిమాను ఇంకా ప్రకటించలేదు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ తన కొత్త సినిమా సంగతి తేల్చాడు అని సమాచారం. ‘సైరన్‌’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆంటోని భాగ్యరాజ్‌తో కలిసి కొత్త సినిమా చేయనున్నాడట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఏదైనా సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్‌ మీద రైటర్‌ అనేలా చాలా రోజులు కూర్చుంటాడు నవీన్‌. అంటే మన సిద్ధు జొన్నలగడ్డలా అన్నమాట. ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్‌ దగ్గరే ఉన్నాడు. అందుకే ఆ రోజు వచ్చాడనన్నమాట. ఆ రోజు వచ్చి ఏం మాట్లాడాడో గుర్తుందిగా. ప్రశాంత్ నీల్, సుకుమార్, లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టిలతో కలసి ఫన్నీ రీల్‌ను చేశాడు.

ఆయా దర్శకుల సినిమాల బాక్సాఫీస్ వసూళ్లను ఉద్దేశిస్తూ.. తన కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ‘రూ. 5000 కోట్ల ఫ్రేమ్’ అంటూ నవ్వులు పూయించాడు. నవీన్‌లోని సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఏంటో ఆ రోజు ఆ వీడియో మరోసారి నిరూపించింది. ఇప్పుడు తన సినిమాతో మరోసారి అదే పని చేసే ఉద్దేశంలో ఉన్నాడు..

‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus