కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయి హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా క్లాసికల్ చిత్రంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ రీత్యా జనతా గ్యారేజ్ ని 67 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1000, ఇతర రాష్ట్రాల్లో 550, విదేశాల్లో 400 స్క్రీన్స్ లో చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో అన్ని షోస్ కలుపుకుని 25 కోట్లను వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే 3 .7 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల మొదటి రోజు కలక్షన్ల జాబితాలో జనతా గ్యారేజ్ మూడో స్థానంలో నిలిచింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్ డే 40 కోట్లు రాబట్టి ప్రథమ స్థానంలో నిలువగా, బ్రహ్మోత్సవం 30 కోట్లు వసూల్ చేసి రెండవ ప్లేసులో ఉంది.