Janhvi Kapoor: సముద్ర తీరాన జాన్వీ కపూర్ బికినీ జోష్!

సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రోజురోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమితంగా పెంచేసుకుంటోంది. మొదట్లో ఈ బ్యూటీ అందాలకు సైతం నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఫస్ట్ సినిమా ధడక్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో జాన్వీపై ట్రోలింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇక ఆ మధ్య నెపోటిజమ్ కామెంట్స్ వల్ల కూడా అప్సెట్ అయ్యింది. కానీ ప్రస్తుతం నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నా కూడా ఈ బ్యూటీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.

రోజురోజుకు తన సరికొత్త గ్లామర్ తో అబ్బాయిల మనసును తనవైపుకు తిప్పుకుంటోంది. ఇక రీసెంట్ గా ఒక సముద్ర తీరాన అమ్మడు ఇచ్చిన స్టిల్స్ అద్బుతంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక మెల్లగా నటనకు ప్రాధాన్యత ఇచ్చే కథలపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టిన జాన్వీ మొత్తానికి గుంజన్ సక్సెనా బయోపిక్ తో పరవాలేదు అనిపించింది. ఆ సినిమా కరోనా వలన డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

ఇక ఇటీవల వచ్చిన హారర్ కామెడీ రూహి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో జాన్వీ బాగానే నటించినట్లు కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ దోస్థానా 2 – గుడ్ లక్ జెర్రీ సినిమాలతో బిజీగా ఉంది.

1

2

3

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus