Janhvi Kapoor: దేవర ట్విస్ట్ చెప్పేసిన జాన్వీ.. ఫస్ట్ పార్ట్ అలా ఉండనుందా?

ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో దేవర ఒకటి కాగా రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దేవర1 (Devara) సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా దేవర సీక్వెల్ మాత్రం 2026 లేదా 2027లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దేవర1 సినిమాలో తన పాత్ర పరిమితం అని జాన్వీ కపూర్ వెల్లడించడం కొసమెరుపు. దేవర ట్విస్ట్ రివీల్ చేసి జాన్వీ ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చింది.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  అలా చెప్పడంలో ఫస్ట్ పార్ట్ లో హీరో తండ్రి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని తేలిపోయింది. దేవరలో శృతి మరాఠే మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు Jr NTR)  జనతా గ్యారేజ్ తో హిట్ ఇచ్చి లోకల్ గా రికార్డులు క్రియేట్ చేసిన కొరటాల శివ  (Koratala Siva) దేవర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

దేవర సినిమా ఒకింత భారీ నిడివితోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది. దేవర సెకండ్ సింగిల్ కు సమయం ఆసన్నం కాగా ఇతర భాషలకు సంబంధించిన లిరికల్ వీడియోలకు సంబంధించిన పనుల వల్ల సెకండ్ సింగిల్ ఆలస్యం అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ సింగిల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

దేవర సినిమా ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకోవడంతో మేకర్స్ కు టెన్షన్ తీరిందని సమాచారం అందుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ (Nandamuri Kalyan Ram)  ఎన్టీఆర్ పై నమ్మకంతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు. మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరించారు. కొరటాల శివ సన్నిహితుడైన ఈ నిర్మాత దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకోనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus