Japan Twitter Review: ‘జపాన్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కార్తీ 25వ సినిమాగా ‘జపాన్’ రూపొందింది. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకుడు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.జి వి ప్రకాష్ కుమార్ సంగీతంలో రూపొందిన పాటలకి కూడా మంచి స్పందన వచ్చింది అని చెప్పాలి. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా..

కార్తీ గజదొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ కూడా ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నవంబర్ 10 న దీపావళి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘జపాన్’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. కార్తీ నటన విశేషంగా అలరిస్తుందట. డైలాగులు కూడా హిలేరియస్ గా ఉంటాయని తెలుస్తోంది.

అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ తో ఆకట్టుకుంటుందట. సునీల్ మరోసారి నెగిటివ్ రోల్లో అలరిస్తాడని అంటున్నారు.అయితే సెకండాఫ్, క్లైమాక్స్ సో సో గా ఉంటాయని అంటున్నారు. మొత్తంగా ‘జపాన్’ ఒకసారి చూసే విధంగా ఉందని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో (Japan) మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

https://twitter.com/ps_jyothi/status/1722749502791238135?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1722749502791238135%7Ctwgr%5E5991e7c1c474d4d4f8da5dfb61b00d8fd6c18720%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fjapan-movie-twitter-review-telugu-1842934

https://twitter.com/Pt54936312/status/1722715389719916997?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1722715389719916997%7Ctwgr%5E5991e7c1c474d4d4f8da5dfb61b00d8fd6c18720%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fjapan-movie-twitter-review-telugu-1842934

 

https://twitter.com/NehaUpa19061714/status/1722700398560264285?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1722700398560264285%7Ctwgr%5E5991e7c1c474d4d4f8da5dfb61b00d8fd6c18720%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fjapan-movie-twitter-review-telugu-1842934

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags