ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాతోపాటు తమిళనాడు రాజకీయాల్లో స్టిల్ ట్రెండింగ్‌లో ఉన్న ఓ టాపిక్ విజయ్ – త్రిష రిలేషన్. ఈ విషయంలో ఎవరూ ఏ క్లారిటీ ఇవ్వకపోయినా.. ఈ టాపిక్ మాత్రం నడుస్తూనే ఉంది. ఈ సమయంలో మరో ప్రేమకథ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అది విజయ్ కొడుకు, ‘సిగ్మా’ సినిమాతో లేటెస్ట్‌గా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన జేసన్ సంజయ్ ప్రేమ కథ.
జేసన్ సంజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల మాట్లాడారు. వ్యక్తిగత జీవితం అనేకంటే తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఒకే ఒక్క ప్రేమకథ ఉంది. కాలేజీ రోజుల్లో ఏడాదిన్నర పాటు ప్రేమించుకున్నాం. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలో మా మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకుని, బంధానికి ముగింపు పలికాం. అదొక మ్యూచువల్ బ్రేకప్ అని జేసన్ క్లారిటీ ఇచ్చేశారు.
మరి ఆ బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడ్డార అని అడగ్గా.. ఆ సమయంలో యువన్ శంకర్ రాజా లవ్ సాంగ్స్ వినేవాడిని. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టలేదు. ఆ స్టోరీల పాత జ్ఞాపకాల్లో చిక్కుకుపోతామో అని అనుకున్నా. అందుకే ఇద్దరం దూరం పాటించాం. వద్దనుకున్న పనులు చేయకుండా నన్ను నేనే కంట్రోల్‌లో ఉంచుకున్నా అని జేసన్ చెప్పారు.
అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉందని, గతాన్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగిపోతున్నానని చెప్పారు. ఆ బ్రేకప్ తర్వాత ‘సిగ్మా’ సినిమా పనిలో బిజీ అయిపోయా అని కూడా చెప్పారు. అంటే ఈ లవ్ బ్రేక్ రీసెంట్ టైమ్‌లో జరిగిందే. ఇక, సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో సంజయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సిగ్మా’. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన ఫలితం అయితే అందుకోలేదు. వరుస వాయిదాలు పడుతూ పడుతూ వచ్చిన సినిమా థియేటర్లలో కూడా పడిపోయింది.