Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. చేయాల్సిన సినిమాల విషయంలో కొత్తదనం మిస్‌ కాకుండా చూసుకునే దర్శకుల్లో వెంకటేశ్‌ మహా ఒకరు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఇలాంటివే. ఆయన తొలి సినిమా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ నుండి రీసెంట్‌గా వచ్చిన ‘రావ్‌ బహదూర్‌’ వరకు అన్ని సినిమాలలో అదే పంథాను ఫాలో అయ్యారాయన. ఇప్పుడు ఆయన తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశారు. ఈసారి డైరక్టర్‌ చేస్తూ నటిస్తున్నారు కూడా. ఆ సినిమా పేరే ‘అట్టహాసం’.

Attahaasam

‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా తరహాలోనే ‘అట్టహాసం’ సినిమను కూడారూపొందిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెంకటేశ్‌ మహా తెలిపారు. ఈ సినిమాలో ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాయఫేమ్ కార్తీక్ రత్నం, ‘పుష్ప’ సినిమా ఫేమ్ పావని కరణం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెంకటేశ్ మహా, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్ స్రవంతి పెపకాయల కూడా నటిస్తున్నారు. స్మరణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2027 వేసవి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

‘అట్టహాసం’ అనే పదానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి వైభవంగా, గొప్పగా జరగడం, రెండోది బిగ్గరగా నవ్వడం. ఇప్పుడు వెంకటేశ్‌ మహా ఏ ఉద్దేశంతో సినిమాకు ఈ పేరు పెట్టారు అనేది చూడాలి. ఆయన సినిమాలో చెప్పాలనుకున్న అంశాలతోపాటు ఓ చిన్న సెటైర్‌ కూడా ఉంటుంది. అదే ఆయన తత్వం. మరిప్పుడు ‘అట్టహాసం’ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ కంటెంట్‌ వస్తే కానీ తెలియదు.

ఒక విధంగా తమ రంగాల్లో యంగ్‌ సెన్సేషన్‌గా నిలిచిన నటులను ఈ సినిమాకు తీసుకుంటున్నారు వెంకటేశ్‌ మహా. అయితే మరి గతంలో ఆయన ఇచ్చిన సెన్సేషనల్‌ విజయాన్ని ఈ సినిమా ద్వారా కూడా ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటికైతే సినిమా మీద టైటిల్‌, లుక్‌తో మంచి బజ్‌ సంపాదించారు. దాన్ని కంటిన్యూ చేసి, బెస్ట్‌ డెలివర్‌ చేయాలి.

మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus