Jathi Ratnalu: ఓటీటీలో జాతిరత్నాలు.. నెటిజన్లు హ్యాపీ..?

  • April 7, 2021 / 07:46 PM IST

గత నెల 11వ తేదీన మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదలై జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు కేవీ అనుదీప్ లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు సమాచారం.

కథ, కథనం లేకపోయినా కామెడీ ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని అవుతుందని జాతిరత్నాలు ప్రూవ్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం. ఇప్పటికే జాతిరత్నాలు సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతిరత్నాలు సినిమా ఓటీటీ కొరకు ఎదురు చూస్తున్న వాళ్లకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

ఈ నెల 11వ తేదీన జాతిరత్నాలు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ నుంచి వెలువడిన ప్రకటనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషల ప్రేక్షకులు జాతిరత్నాలు సినిమాను డబ్బింగ్ చేయాలని కోరుతుండటం గమనార్హం. ఓటీటీలో కూడా జాతిరత్నాలు సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus