Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 13, 2023 / 07:53 PM IST

కోలీవుడ్లో ఆల్ రౌండర్లుగా పేరొందిన రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌జే సూర్య..లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని ‘స్టోన్ బెంచ్ ఫిలింస్’ బ్యాన‌ర్‌ పై కార్తికేయన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ముఖ్యంగా టీజర్ కి సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.

ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల అయ్యింది. మొదటి రోజు టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే నమోదయ్యాయి.కానీ రెండో రోజు కొంత పర్వాలేదు అనిపించింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.58 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.14 cr
ఈస్ట్ 0.11 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.11 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.08 cr
ఏపి+ తెలంగాణ 1.36 cr

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. టాక్ పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.36 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కొంత గ్రోత్ అయితే ఈ సినిమా చూపిస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ కి ఈ మాత్రం సరిపోదు అనే చెప్పాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus