రాజమౌళి సినిమాలో హీరోగా నటించడం అంత తేలిక కాదనే సంగతి తెలిసిందే. జక్కన్న మూవీలో హీరో సినిమా కోసం లుక్ ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమాకు కమిటవ్వకూడదు. కొమరం భీమ్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో భీమ్ పాత్ర గురించి చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొమరం భీమ్ లుక్ కోసం 18 నెలలు కఠినమైన కసరత్తులు చేశానని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ పాత్ర కొరకు ఏకంగా 9 కేజీల మజిల్ బాడీని పెంచాల్సి వచ్చిందని తారక్ భీమ్ రోల్ కోసం పడిన కష్టాన్ని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొరటాల శివతో తెరకెక్కుతున్న మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తాను హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నానని తారక్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత పాన్ ఇండియా కథలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లకే తన సినిమాలను డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు.
తారక్ డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటున్న తీరు పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా బారిన పడిన ఎన్టీఆర్ హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. ఎన్టీఆర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ మజిల్ బాడీని పెంచాడని తెలిసి రాజమౌళి తారక్ ను బాగానే టార్చర్ చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!