సహజంగా టాలీవుడ్ లో టాప్ హీరోలకు ఎవరు ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంటుంది. హీరోలందరూ తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటారు. కానీ వారి ఫాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తన్నుకు చస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క హీరోలు మాత్రం ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే…శ్రీమంతుడు భారీ విజయం సాధించడంతో బడా హీరోలందరూ ప్రిన్స్ మహేష్ కు ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. అందులో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.
సినిమా చూసి ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని ప్రిన్స్ కు ఫోన్ చేసి మరీ చెప్పడమే కాకుండా, దాదాపుగా 5నిమిషాలకు పైనే ప్రిన్స్ తో మాట్లాడాడు ఎన్టీఆర్. ఇక ఆ ఫోన్ తో షాక్ తిన్న ప్రిన్స్, ఎన్టీఆర్ ది ఎన్టీఆర్ కు తిరిగి ఇచ్చెయ్యాలి, లేదంటే లావు అయిపోతా అనుకున్నాడో ఏమో కానీ…మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ విషయంలో వేలు పెట్టాడు. ఎంతకీ ప్రిన్స్ ఏం చేశాడు అంటే…జూనియర్ తో ఎటువంటి సంబంధం లేకుండా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీలో మహేష్ వాయిస్ ఇస్తున్నాడు. ఈ మూవీకి నేపథ్య మాటలను ప్రిన్స్ మహేష్ బాబు చేత చెప్పించాలని కొరటాల అనుకుని ప్రిన్స్ కు తెలుపగా, ప్రిన్స్ వెంటనే ఒప్పుకున్నాడని టాక్. అయితే ఇక్కడ ట్విష్ట్ ఏంటంటే…ఈ విషయం జూనియర్ కి తెలియదంటా…ఎన్టీఆర్ కు సర్ప్రైస్ ఇద్దాం అని అందరూ అనుకునే లోపే, చిత్ర యూనిట్ లో జరుగుతున్న చర్ఛల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జూనియర్ కొరటాలను అడగగా చేసేది ఏమీలేక అసలు విషయం చెప్పడంటా మన దర్శకుడు.