NTR: టీజర్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న తారక్..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశారు. యూట్యూబ్ లో భీమ్ టీజర్ ద్వారా అరుదైన ఫీట్ ను అందుకున్నారు. కొమురం భీమ్ టీజర్ యూట్యూబ్ లో ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ ను అందుకుంది. కేవలం యూట్యూబ్ ద్వారానే ఎన్టీఆర్ ఈ రికార్డును సొంతం చేసుకోవడంతో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతేడాది అక్టోబర్ 22వ తేదీన కొమురం భీమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజైంది.

ఈ టీజర్ కు 13 లక్షల లైక్స్ వచ్చాయి. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో కాల్ప‌నిక గాథ‌తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నెల 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. కరోనా వల్ల ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. బాహుబలి సిరీస్ సినిమాలతో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆ రికార్డులను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా కథ గురించి ప్రేక్షకులకు రాజమౌళి ఏ మాత్రం హింట్ ఇవ్వడం లేదు. మర్యాదరామన్న, ఈగ సినిమా కథలను ముందుగానే చెప్పేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కథ గురించి రివీల్ చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో అంచనాలకు అందని ట్విస్టులతో రాజమౌళి ప్రేక్షకులను మెప్పించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ హైలెట్ అవుతారని సెకండాఫ్ లో చరణ్ హైలెట్ అవుతారని తెలుస్తోంది.


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus