Jr NTR: ఆ పని చేయడం తారక్ కు వరమైందా.. ఏం జరిగిందంటే?

  • July 22, 2023 / 06:08 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైన సమయంలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. పండుగ సెలవులను చూసుకుని ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడం జరిగింది. అయితే వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజయ్యే సినిమాల జాబితా ఎక్కువగానే ఉంది.

పుష్ప2, గేమ్ ఛేంజర్, ప్రాజెక్ట్ కే సినిమాలు సమ్మర్ ను టార్గెట్ చేశాయి. అయితే దేవర సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాకు ఇతర హీరోల సినిమాలు దేవర సినిమాకు రెండు వారాలు అటూఇటుగా రిలీజ్ కావాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్ వర్కౌట్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రిలీజ్ డేట్ ను ప్రకటించడం ఈ సినిమాకు వరమైందని సమాచారం అందుతోంది.

దేవర మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాది నవంబర్ సమయానికి ఈ సినిమా షూట్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. దేవర సినిమా రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కిందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమాలో తారక్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

దేవర సినిమా తారక్ (Jr NTR) కెరీర్ లో మెమొరబుల్ సినిమాగా నిలవడంతో పాటు నటుడిగా తారక్ ను మరో మెట్టు పైకి ఎక్కిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ వార్2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానుండగా ఈ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus