Devara: ఈ విషయం తెలిస్తే తారక్ ఫ్యాన్స్ అస్సలు ఆగలేరు.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా వరుస పండుగలను టార్గెట్ చేసుకుని ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో దేవర మూవీ షూటింగ్ తో బిజీ కానున్నారు. అయితే దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రో సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని సమాచారం అందుతోంది.

పెద్ద పోర్ట్ లో ఇంట్రడక్షన్ సీన్ షూట్ జరిగిందని ఇందుకోసం భారీ ఓడను ఉపయోగించారని తెలుస్తోంది. ఇంట్రడక్షన్ సీన్ లో ఓడలో ఉన్న కంటైనర్లను తీసుకోవడానికి విలన్ ప్రయత్నించగా ఆ సమయంలో హీరో ఎంట్రీ ఉంటుందని హీరో ఎంట్రీ సమయంలో నీటి నుంచి ఓడ పైకి ఎగురుతుందని సమాచారం. సెట్స్ లోనే ఈ సన్నివేశాలను తీశారని చాలా న్యాచురల్ గా ఈ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దేవర సినిమా ఔట్ పుట్ విషయంలో కొరటాల శివ తీసిన సీన్ల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

పల్లెటూరి యాసలో తారక్ చెప్పే డైలాగ్స్ అదరహో అనిపిస్తాయని బోగట్టా. ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఇంట్రడక్షన్ సీన్ ఉండనుందని సమాచారం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని తారక్ ఫ్యాన్స్ ను ఈ సినిమా అమితంగా మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ ప్రశాంత్ కాంబో (Devara) మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus