Jr NTR: ఎవరైనా అలా మాట్లాడితే ఎన్టీఆర్ కు అస్సలు నచ్చదట తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనసు కలవాడని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కి కాస్త కోపం ఎక్కువ. ఈయన ఎంతగా కోప్పడతారు అంతకుమించి ప్రేమను చూపిస్తారని అలాగే ఇతరుల పట్ల జాలి కూడా చూపిస్తారు.

అని మనం పలు సందర్భాలలో చూసాము. అయితే (Jr NTR) ఎన్టీఆర్ కు కోపం తెప్పించే విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ అత్యంత కోపం తెప్పించే మాటలు కొన్ని ఉన్నాయని తెలుస్తుంది. ఎవరైనా తన ముందు ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే తన బిపి ఓ రెంజ్ లో పెరిగిపోతుందట. అలాంటి మాటలు విన్న సమయంలో తన ముందు ఎవరున్నారనే విషయం కూడా చూడకుండా వారికి లెఫ్ట్ రైట్ ఇస్తారని తెలుస్తుంది.

మరి ఎన్టీఆర్ కు కోపం తెప్పించే ఆ మాటలు ఏంటి అనే విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మహిళలకు చాలా గౌరవం ఇస్తారు చిన్నప్పటి నుంచి తన తల్లిగారు తనని అలాగే పెంచారు. సినిమాలలో కూడా ఎన్టీఆర్ మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉండడం మనం చూస్తుంటాము.ఇలా మహిళలను గౌరవించే ఎన్టీఆర్ ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన, వారి గురించి కామెంట్స్ చేసిన ఏమాత్రం సహించరట.

ఇలా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని కామెంట్ చేయడం కనుక ఎన్టీఆర్ చెవిలో పడ్డాయి అంటే తన ముందు ఎవరున్నారనే విషయాన్ని కూడా పక్కనపెట్టి ముందు వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతారని తెలుస్తోంది. ఏది ఏమైనా మహిళలంటే ఇలా గౌరవం ఇచ్చే హీరోలు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus