Jr NTR, Koratala Siva: దేవర లీక్స్ కు చెక్ పెడుతున్న కొరటాల.. ఆ నిర్ణయం అమోఘమంటూ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ లోకల్ లెవెల్ లో రికార్డులను రిపేర్లు చేయగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా దేవర ఇంటర్నేషనల్ లెవెల్ లో రికార్డులను రిపేర్లు చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవర సినిమా నుంచి ఇప్పటికే పలు అప్ డేట్స్ అధికారికంగా రాగా మరికొన్ని అప్ డేట్స్ అనధికారికంగా లీక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు లీక్స్ టెన్షన్ ఎక్కువైంది.

లీక్స్ వల్ల నిర్మాతలు సైతం భారీ మొత్తంలో నష్టపోతున్నారు. అయితే దేవర లీక్స్ కు చెక్ పెట్టాలనే ఆలోచనతో 24 క్రాఫ్ట్ లకు చెందిన ఎవరూ షూటింగ్ లొకేషన్ కు సెల్ ఫోన్ తీసుకొనిరాకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలుస్తోంది. దేవర మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయం అమోఘమంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది. కెరీర్ పరంగా 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ ఈ సినిమాతో ఆ సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుండగా ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

2024 సమ్మర్ లో ఈ సినిమా సంచలనాలను సృష్టించనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ మార్కును ముద్రించుకుంటామని ఫీలవుతున్నారు. దేవర రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus