Jr NTR,Sukumar: : సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్… మరో హిట్ పడినట్లే,?

  • June 14, 2023 / 03:00 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇలా ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతోంది ఇలా రెండు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ప్రేక్షకులు కూడా కొంత పాటీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ ను కవర్ చేయడం కోసం ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్లో పెట్టారని తెలుస్తుంది.

ఇలా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నటువంటి వార్ 2సినిమాలో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కనుక ఆలస్యం అయితే ఆ గ్యాప్ లో ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్లో నాన్నకు ప్రేమతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ క్రమంలోనే మరోసారి (Jr NTR) ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారని తెలియడంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి వివరాలు తెలియనున్నాయి. ఇక సుకుమార్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus