చాలాకాలం తరువాత ఫ్యాన్స్ కి దర్శనం ఇచ్చిన ఎన్టీఆర్

  • July 13, 2020 / 03:04 PM IST

కొమరం భీమ్ ఎన్టీఆర్ ఓ చిన్న వీడియోలో దర్శన మిచ్చారు. జులై 17 గుర్తు పెట్టుకోండి, మన విజయవాడలో ఓ అద్భుతం చోటు చేసుకోనుంది. తెలుసుకోవాలని ఉందా…? అని సస్పెన్స్ లో పెట్టారు. ఐతే అది ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించిన ప్రచార వీడియో అని తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ అనేక వ్యాపార ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. కాగా సెలెక్ట్ అనే ఓ మొబైల్ స్టోర్స్ చైన్ కి కూడా ఎన్టీఆర్ ప్రచార కర్తగా ఉన్నారు.

ఆ బ్రాండ్ షో రూమ్ జులై 17న ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఆ ప్రకటనలో భాగంగా ఎన్టీఆర్ ఆ వీడియోలో దర్శనం ఇచ్చారు. చాలా కాలం తరువాత బయట కనిపించిన ఎన్టీఆర్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆయన కొమరం భీమ్ లుక్ కంటిన్యూ చేస్తున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసి కూడా వెనక్కి తగ్గారు. హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పాటు, షూటింగ్స్ కి తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇవ్వడంతో ఆయన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఓ భారీ సెట్ వేయించారు. ఐతే కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో రాజమౌళి షూటింగ్ నిలిపివేశారు. దీనితో ముందుగా ప్రకటించినట్లు ఆర్ ఆర్ ఆర్ జనవరి 2021లో విడుదల అయ్యే సూచనలు లేవని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.


15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus