15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!

అదేంటో ఒక సినిమాతో కాకపోతే మరో సినిమాతో అయినా హిట్లు కొడుతుంటారు కొంతమంది డైరెక్టర్లు. ఉదాహరణకు మన సురేంద్ర రెడ్డిని తీసుకుంటే.. ఆయన కంటిన్యూస్ గా హిట్లు కొట్టిన సందర్భాలు లేవు. ఒక హిట్ ఇస్తాడు.. తరువాత ఒక యావరేజ్ లేదా ప్లాప్ ఫలితాన్ని మూటకట్టుకుంటాడు. అయితే మినిమం గ్యాంటీ సినిమాలు అందిస్తారు అనుకునే డైరెక్టర్లు.. ఎందుకో కొంత కాలం నుండీ హిట్లు కొట్టలేక డీలా పడిపోయారు. వీళ్లందరి డౌన్ ఫాల్ ఒక్క సినిమాతోనే మొదలయ్యింది. మరి ఆ డైరెక్టర్స్ ఎవరు? వారి కెరీర్ పై బాంబ్ ఏసిన సినిమాలు ఏంటి.. అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) వై.వి.ఎస్.చౌదరి :

ఈయన అప్పటి వరకూ మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. కానీ బాలకృష్ణతో చేసిన ఒక్క మగాడు చిత్రం ఈయన కెరీర్ పై బాంబ్ వేసింది. తరువాత ఇప్పటి వరకూ ఈయన కోలుకోలేదు.

2) కరుణాకరణ్ :

ప్రేమకథా చిత్రాలకు తనదైన కామెడీని జోడించి ప్రెజెంట్ చేసే దర్శకుడు కరుణాకరణ్ సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ అనేలా ఉండేవి. కానీ రామ్ తో చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాతో ఈయన కెరీర్ పై బాంబ్ పడింది. ఈయన కూడా ఇప్పటికీ కోలుకోలేదు.

3)బి.వి.ఎస్ రవి :

ఈయన గోపిచంద్ తో ‘వాంటెడ్’ అనే చిత్రంతో పరిచయమయ్యాడు. మొదటి చిత్రంలో ఈయన రైటింగ్ బాగానే ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ బాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ తరువాత సాయి తేజ్ తో చేసిన ‘జావాన్’ చిత్రం ఈయన కెరీర్ పై బాంబ్ వేసింది. ఈ చిత్రం వచ్చి మూడేళ్లు అవుతున్నా… ఇప్పటికీ మరో సినిమా చేసే అవకాశం ఈయనకి దక్కలేదు.

4) జయంత్ సి పరాన్జీ :

ఈయన కూడా ఒకప్పుడు టాప్ డైరెక్టరే..! కానీ బాలకృష్ణతో చేసిన ‘అల్లరి పిడుగు’ చిత్రం ఈయన కెరీర్ పై పెద్ద బాంబ్ వేసింది.

5)దశరథ్ :

ఈయన కూడా 2 హిట్లు .. 3 యావరేజ్ లు అందించిన డైరెక్టరే..! కానీ నాగార్జున తో చేసిన ‘గ్రీకు వీరుడు’ చిత్రం ఈయన కెరీర్ పై బాంబ్ వేసింది.

6) క్రాంతి మాధవ్ :

‘ఓనమాలు’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ కెరీర్ కు..విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం పెద్ద బాంబ్ వేసిందనే చెప్పాలి.

7)మెహర్ రమేష్ :

‘కంత్రి’ ‘బిల్లా’ వంటి రెండు యావరేజ్ సినిమాలు అందించిన దర్శకుడు మెహర్ రమేష్ కెరీర్ పై.. ఎన్టీఆర్ ‘శక్తి’ పెద్ద బాంబ్ వేసిందనే చెప్పాలి.

8) సతీష్ వేగేశ్న :

ఈయన కూడా ‘దొంగల బండి’ ‘శతమానం భవతి’ వంటి డీసెంట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టరే..! కానీ నితిన్ తో చేసిన ‘శ్రీనివాస్ కళ్యాణం’ చిత్రం ఈయన కెరీర్ పై బాంబ్ వేసింది.

9)శ్రీనువైట్ల :

మినిమం గ్యారెంటీ డైరెక్టర్స్ లో టాప్ ఆర్డర్ లో ఉండే శ్రీను వైట్ల… ‘ఆగడు’ సినిమా ఎందుకు చేసాడో కానీ.. ఆ సినిమాతో ఈయన కెరీర్ పై పెద్ద బాంబ్ పడింది.

10)శ్రీకాంత్ అడ్డాల :

కుటంబ కథా చిత్రాలను కొత్త రకంగా తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పై ‘బ్రహ్మోత్సవం’ సినిమా పెద్ద బాంబ్ వేసింది.

11)శ్రీవాస్ :

ఈయన కూడా మంచి కమర్షియల్ చిత్రాలను అందించే డైరెక్టరే. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన ‘సాక్ష్యం’ చిత్రం ఈయన కెరీర్ పై పెద్ద బాంబ్ వేసింది.

12)వి.వి.వినాయక్ :

రాజమౌళి తరువాత ప్లేస్ లో ఉండేవాడు వి.వి.వినాయక్. కానీ ‘అఖిల్’ అనే అనే చిత్రం ఈయన కెరీర్ పై పెద్ద బాంబ్ వేసింది. ఆ దశలో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో ఆదుకున్నప్పటికీ.. మళ్ళీ సాయి తేజ్ తో చేసిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈయన కెరీర్ పై బాంబ్ వేసింది.

13) వక్కంతం వంశీ :

ఈయన తీసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా అల్లు అర్జున్ తో చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈయన రైటర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. కానీ డైరెక్టర్ గా మారి తీసిన ‘నా పేరు సూర్య’ ఈయన కెరీర్ పై బాంబ్ వేసేసింది. నెక్స్ట్ ఛాన్స్ రాకుండా ఆపేస్తుంది.

14) బోయపాటి శ్రీను:

అప్పటి వరకూ అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న… బోయపాటి శ్రీను కి… ‘వినయ విధేయ రామ’ చిత్రం పెద్ద షాక్ ఇచ్చింది. అప్పటి వరకూ ఉన్న మంచి పేరు పై ఈ చిత్రం చాలా పెద్ధ దెబ్బ కొట్టింది.

15) గుణశేఖర్

మొహమాటానికి చేసాడో.. రెమ్యూనరేషన్ కోసం చేసాడో కానీ.. గుణశేఖర్ ఈ సినిమా చేసి చాలా తప్పు చేసాడు. కానీ రవి తేజ తో చేసిన ‘నిప్పు’ చిత్రం ఈయన కెరీర్ పై బాంబ్ వేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus