Jr NTR: పిల్లల విషయంలో యంగ్ టైగర్ సంచలన నిర్ణయానికి కారణమిదా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా కుటుంబానికి సైతం తారక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తారక్ పెద్ద కొడుకు రాజమౌళి మహేష్ కాంబో మూవీతో సినిమాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే పిల్లల విషయంలో తారక్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తారక్ తన కొడుకులకు సూచించారని తెలుస్తోంది.

కత్తికి రెండు వైపులా ఏ విధంగా పదును ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అదే విధంగా పాజిటివిటీ, నెగిటివిటీ ఉంటుంది. తన కొడుకులు నెగిటివిటీకి దూరంగా ఉండాలని చదువుకునే వయస్సులో సోషల్ మీడియాపై దృష్టి పెడితే ఆ ప్రభావం చదువుపై పడుతుందని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తారక్ దేవర సినిమా స్క్రిప్ట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

దేవర సినిమాలో మాస్ ప్రేక్షకులతో పాట్ క్లాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగ రోజులా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరోమారు సోలో హీరోగా బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు.

అల్లు అర్హ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. శాకుంతలం సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోని అల్లు అర్హ దేవర సినిమాతో మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ విషయంలో (Jr NTR) తారక్ మరో మెట్టు పైకి ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus