Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Advertisement

అల్లు అర్జున్ (Allu Arjun) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఇది మైథలాజికల్ సినిమా అని కూడా ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ 22వ సినిమాగా ఈ ప్రాజెక్టు మొదలవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టుతో ముందుకెళ్లాడు.

Jr. NTR

ఇదిలా ఉండగా… ఎన్టీఆర్ (Jr. NTR) ఇటీవల ‘వార్ 2’ (War 2) పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబైలో ఎన్టీఆర్ (Jr. NTR) ని పాపరాజీ టీం వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ అనే పేరుతో పుస్తకం ఉండటాన్ని మనం గమనించవచ్చు. ‘ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్’ అని ఆ పుస్తకంపై ఉంది.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవితం గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయని కొందరు పెద్దలు హిందూ పండిట్లు చెబుతుంటారు. ‘వార్ 2’, (War 2) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘డ్రాగన్’ సినిమాల తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు. నాగవంశీ (Naga Vamsi) ఇటీవల ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ (Allu Arjun) రిజెక్ట్ చేసిందే.

దాని కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవితం గురించి అని గతంలో టాక్ వినిపించింది. ఇప్పుడు ఎన్టీఆర్ (Jr. NTR) చేతిలో ఉన్న పుస్తకాన్ని బట్టి.. ‘ఎన్టీఆర్ అప్పుడే త్రివిక్రమ్ (Trivikram) సినిమా కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేశాడు’ అని అర్థం చేసుకోవచ్చు.

‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus