జనతా గ్యారేజ్ లో ఫాలో అవుతున్న అంశాలు

  • August 30, 2016 / 09:16 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ విడుదలకు ముందే ప్రభంజనం సృష్టిస్తోంది. తారక్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోతున్నాయి. టీజర్, ట్రైలర్ లు యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఇందులో ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాడు. “నాన్నకు ప్రేమతో” సినిమాలో హెయిర్ స్టయిల్ ని ఫాలో అయినట్లు, జనతా గ్యారేజ్ లో అభిమానులు ఫాలో అవుతున్న అంశాలు ఇవే..

నేచర్ లవర్జనతా గ్యారేజ్ లో తారక్ ప్రకృతి ప్రేమికుడిగా నటించారు. మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను చెప్పారు. దీంతో అయన అభిమానులతో పాటు అందరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ముందుకు వస్తున్నారు.

వాచ్మొబైల్స్ వచ్చినప్పటి నుంచి చేతికి గడియారాలను పెట్టుకోవడం దాదాపు మానేశారు. ట్రైలర్ లో యంగ్ టైగర్ వాచీ పెట్టుకోవడం చూసి యూత్ ఫ్యాషన్ గడియారాలపై పడ్డారు.

బ్యాగ్కాలేజీకి వెళ్లేటప్పుడు బ్యాగ్ అవసరమే.. భుజానికి తగిలించుకునివే ఎక్కువమంది వాడుతుంటారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో వాడిన తరహా బ్యాగ్ లకు మార్కెట్ లో ప్రస్తుతం గిరాకీ ఏర్పడింది.

బుల్లెట్

సినిమాల్లో హీరో వాడే బైక్ లకు క్రేజ్ రావడం సహజం. అలాగే బుల్లెట్ కి ఎప్పటినుంచో ఓ రేంజ్ ఉంది. ఈ రెండింటిని కొరటాల శివ మిక్స్ చేశారు. దీంతో బుల్లెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

స్టైల్జనతా గ్యారేజ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ కోటెడ్ క్లాస్ లుక్ తో అదరగొట్టాడు. ఈ స్టైల్ ని మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరూ ఫాలో అవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus