కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వారిలో సూర్య జ్యోతిక జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా వీరిద్దరూ నటీనటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక సూర్య ప్రేమ వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ సూర్య ప్రేమను అంగీకరించి తిరిగి మరోసారి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమయ్యారు. పిల్లలు పెద్దయిన తర్వాత ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయినటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈమె ముంబైకి షిఫ్ట్ అయ్యారు.
తన భర్త పిల్లలతో కలిసి ముంబైలోనే నివసిస్తున్నారు దీంతో సూర్య కుటుంబంలో వివాదాలు వచ్చాయని వీరిద్దరు విడిపోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల పై తాజాగా జ్యోతిక స్పందించారు. తాను బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవటం మళ్ళి ముంబై షిఫ్ట్ అయ్యానని అలాగే పిల్లల చదువుల కోసం కూడా అక్కడ ఉండాల్సి వస్తుందంటూ ఈమె (Jyothika) తెలిపారు.
పిల్లల చదువులు పూర్తికాగానే తిరిగి తాము చెన్నై వస్తామని వెల్లడించారు. ఇలా ముంబై వెళ్లడానికి అసలు విషయం చెప్పడంతో వీరి విడాకులు గురించి వస్తున్నటువంటి వార్తలలో కూడా ఏమాత్రం నిజం లేదని అదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టమవుతుంది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!