Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

కీరవాణి చిన్న కుమారుడు, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కాలభైరవ(Kaala Bhairava) అందరికీ సుపరిచితమే. కీరవాణితో కలిసి రాజమౌళి సినిమాలకి పనిచేసిన ఆయన తర్వాత.. ‘మత్తు వదలరా’ ‘కలర్ ఫోటో’ ‘కార్తికేయ 2’ వంటి హిట్ సినిమాలకి సంగీతం అందించి నేషనల్ వైడ్ తన సత్తా చాటుకున్నాడు. బాహుబలిలోని ‘దండాలయ్యా’ అలాగే ‘ఆర్ ఆర్ ఆర్’ లోని ‘నాటు నాటు’ వంటి సెలబ్రేటింగ్ సాంగ్స్ ని ఆలపించాడు కాలభైరవ.

Kaala Bhairava

ఇదిలా ఉండగా.. మొన్నమధ్య కాలభైరవ పెళ్ళి ఫిక్స్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘బలగం’ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, కాలభైరవ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, అతి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని.. ఎక్కువగానే వార్తలు వచ్చాయి. వీరి డేటింగ్ రూమర్స్ కి మరింత బూస్టప్ ఇస్తూ ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే తర్వాత ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చింది అంటూ ఏమీ లేదు.

అయితే ఈరోజు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు కాలభైరవ హాజరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మిస్తుండగా.. దీనికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదే ఈవెంట్లో మీడియాతో ముచ్చటిస్తున్న టైమ్లో ఓ రిపోర్టర్.. ” ఇటీవల కాలంలో మీ పెళ్ళి టాపిక్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై ఒక క్లారిటీ ఇస్తారా?” అంటూ ప్రశించాడు.

అందుకు కాలభైరవ స్పందించేందుకు నిరాకరించాడు. దీంతో పక్కనే ఉన్న కార్తికేయ.. గట్టిగా ఓ సౌండ్ వేయమని సిగ్నల్ ఇచ్చాడు, కాలభైరవ కూడా అదే సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత అందరూ లేచి వెంటనే ప్రెస్ మీట్ ని ముగించి వెళ్ళిపోయారు. ఆ వార్తల్లో నిజం లేకపోతే ‘అవన్నీ బేస్ లెస్ అనో లేక… ఫాల్స్’ అనో చెబితే అక్కడితో ఫుల్స్టాప్ ఇచ్చేసినట్టు అవుతుంది. కానీ ఇలా ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఎస్కేప్ అయితే ఆ రూమర్స్ ని కన్ఫర్మ్ చేసినట్టే అనుకోవాలేమో..!

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

 

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus