Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

అసలోడు వస్తున్నాడు.. ఎన్టీవోడు వస్తున్నాడు.. తెలగు రాజకీయాల్లో నెక్స్ట్‌ బిగ్‌ మూమెంట్‌ ఇదే.. తమిళనాట విజయ్‌ వాడిన ఫార్ములాను ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్‌ వాడుతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగు తెలుగు రాష్ట్రాల సోషల్‌ మీడియాలు, రాజకీయ వర్గాలు, సినిమా వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి కారణం ఎన్టీఆర్‌ అభిమానులు చేపడతాం అంటూ ప్రకటించిన ‘ఊరూ వాడా’ కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమాల పరంపరను జులై 18 నుండి స్టార్ట్‌ చేస్తామని ప్రకటించారు RAWNTR టీమ్‌..

Jr Ntr

ఈ స్టేట్‌మెంట్‌ రాగానే.. ఎన్టీఆర్‌ నెక్స్ట్‌ స్టెప్‌ పాలిటిక్స్‌యే అని.. అందుకే తమిళనాడు సీఎం విజయ్‌ జోసెఫ్‌ తరహాలో ముందు గ్రామాల్లో తన టీమ్‌ ద్వారా పట్టు సంపాదించే పనులు చేస్తున్నాడు అని విశ్లేషణలు వచ్చాయి. ఎందుకంటే విజయ్‌ మూడేళ్ల క్రితం ఇలానే గ్రామాల్లో తన టీమ్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు. అవే ఇప్పుడు తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కి ఓట్లు వచ్చేలా చేశాయి అని తమిళ రాజకీయవేత్తల విశ్లేషణ కూడా. దీంతో ఎన్టీఆర్‌ ఇన్‌ టు పాలిటిక్స్‌ అనే చర్చ వచ్చింది.

అయితే, ఇప్పుడు RAWNTR టీమ్‌ నుండి ఓ క్లారిఫికేషన్‌ పోస్టు బయటకు వచ్చింది. ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రం అంటూ కొన్ని పోస్టులు మా దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా మేం చెప్పాలనుకుంటుంది ఒకటే.. అవన్నీ రూమర్స్‌ అస్సలు నమ్మొద్దు. అధికారికంగా ఎన్టీఆర్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు. మేం నిర్వహిస్తున్న ‘ఊరూ వాడా’ ఈవెంట్‌ చాలా రోజుల క్రితమే అనుకున్నాం. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ఆలోచన లేదు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

అలాగే, ఈ కార్యక్రమం గురించి అదనపు సమాచారాన్ని త్వరలో తెలియజేస్తాం అని కూడా టీమ్‌ RAWNTR చెప్పింది. దీంతో ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి ఆశలు పెట్టుకున్న వారు నిరాశపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడో మాట ఉంది. గతంలో విజయ్‌ కూడా తొలుత తన సేవా సంస్థ పనుల విషయంలో ఇలానే అంటీ ముట్టనట్లుగానే ఉన్నారని టాక్‌.

గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus