పెళ్లైందని కొత్త పేరు పెట్టుకున్నట్టుంది..!

  • February 9, 2021 / 12:25 PM IST

కరోనా టైములో వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో.. కాజల్ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. అలా అని సినిమాలు మానేస్తున్నట్టు ఈమె ప్రకటించలేదు. సినిమాలు మానెయ్యాలనే ఉద్దేశం ఉన్నట్టు కూడా ఆమె ప్రకటించలేదు. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పెళ్ళైనప్పటికీ… కాజల్ సినిమాల్లో నటిస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కాజల్ తన పేరుని మార్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు మరియు ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్‌ లు ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అందుకే తాజాగా తన పేరుని మార్చుకుందట కాజల్. అలా అని పెద్ద ఎత్తున కాదులెండి. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కాజల్ తన పేరు మార్చుకుంది. తన భర్త కిచ్లూ పేరు కలసి వచ్చేలా Kajal A Kitchlu అని మార్చుకుంది కాజల్. ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్ళు దాటినా.. ఇంకా లీడింగ్ యాక్ట్రెస్ గానే రాణిస్తుంది కాజల్. ప్రస్తుతం కమల్ -శంకర్ ల ‘ఇండియన్2’ అలాగే చిరు – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ వంటి బడా చిత్రాల్లో నటిస్తుంది కాజల్.

అంతేకాకుండా ఈమె విష్ణుతో కలిసి నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. దాంతో పాటు ‘లైవ్ టెలికాస్ట్’ అనే మూవీ కూడా డిస్నీ + హాట్ స్టార్ ఓటిటి వేదికలో విడుదల కాబోతుంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus