తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అయితే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాతో పాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక కాజల్ తాజాగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముంబైలో డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు. అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత ఆమె మోడలింగ్ రంగం వైపు అడుగులు వేశారు.
ఇలా మోడలింగ్ చేస్తున్న తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇలా సినిమా అవకాశాలు రావడంతో తాను చదువుకు స్వస్తి పలికాను అని తెలిపారు. ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత నా సినిమా వ్యవహారాలన్నీ కూడా నా తల్లి గారే చూసుకునేవారు అని తెలిపారు. ఇక పెళ్లయిన తర్వాత నా సినిమా వ్యవహారాలన్నింటినీ కూడా నా భర్త గౌతం చూసుకుంటున్నారని ఈ సందర్భంగా కాజల్ తెలిపారు.
పెళ్లి తర్వాత తల్లిదండ్రులను వదిలి వచ్చాననే భావన నాలో ఏ మాత్రం కలగకుండా అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటున్నారని ఈమె తెలియజేశారు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు తల్లిగా,భారీగా నా జీవితాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉందని ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి కాజల్ (Kajal Aggarwal) చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!