అవకాశం వచ్చినప్పుడు కొత్త హీరోతో సినిమా చెయ్యడానికి హీరోయిన్ లు ఓకే చెప్పినా… తర్వాత మాత్రం కొంచెం ఫేం ఉన్న హీరోతో అయితేనే సినిమాలు చెయ్యడానికి ఓకే చెబుతారు. ఎందుకంటే ఓ సారి వారికి గుర్తింపు వచ్చాక.. దానిని ఉపయోగించుకుని క్రేజ్ పెంచుకోవాలి అనే చూస్తుంటారు. ఆ టైములో కొత్త హీరోలు … ప్లాప్ హీరోలతో సినిమాలు చెయ్యడానికి ఓకే చెప్పరు. అందులోనూ టాప్ లో ఉన్న హీరోయిన్లు అయితే ముందే నో చెప్పేస్తారు.
ఇప్పుడు కాజల్ కూడా అదే పని చేసింది. ఇటీవల ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథ కాజల్ కు బాగా నచ్చిందట. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. ఆ కథ అంతలా కాజల్ ను అట్రాక్ట్ చేసేసింది. అయితే హీరో ఎవరు అని అడుగగా దానికి డైరెక్టర్…తమిళనాడు మాజీ సీయం కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ అని చెప్పాడట. దాంతో ఒక్కసారిగా కాజల్ షాక్ తింది. అసలు ఒక్క హిట్టు కూడా లేని ఆ హీరోకి జంటగా నటిస్తే ఇక దుకాణం సర్దెయ్యాల్సిందే..
అని భయపడిందో ఏమో… వెంటనే ‘నేను చెయ్యలేను ఇంకొకరిని చూసుకోండి అని మోహం పైనే చెప్పేసి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ .. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!