Kajal Aggarwal: హాట్ టాపిక్ గా మారిన కాజల్ లేటెస్ట్ ఫోటో..!

టాలీవుడ్ చందమామ కాజల్‌ గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 16 ఏళ్ళుగా ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.ప్రస్తుతం కాజల్… మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తుంది.దాంతో పాటు నాగార్జున మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది. గతేడాది ఎవ్వరూ ఊహించని విధంగా తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న కాజల్…

సినిమాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టను అని క్లారిటీ ఇచ్చింది. ఆమె చెప్పినట్టు గానే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు ఆమె సైన్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో కాజల్ తమిళ లో ‘రౌడీ బేబీ’ అనే చిత్రం చేస్తుంది. హర్రర్ థ్రిల్లర్‌ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ ఓ బిడ్డకు తల్లిగా కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.ఇందులో తల్లి-కుమార్తె మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయట.

మరో షాకిచ్చే అంశం ఏంటంటే.. ఈ చిత్రంలో కాజల్ డిగ్లామరస్ గా కనిపించబోతుందట.లేటెస్ట్ ఫోటోని చూస్తే ఆ విషయం నిజమే అనిపిస్తుంది.కాజల్ పక్కన నిలబడి ఉన్న పాప ఈ చిత్రంలో ఆమె కూతురి పాత్రలో కనిపించబోతుంది. తమిళ దర్శకుడు శరవణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ తో పాటు సత్యరాజ్, లక్ష్మీ రాయ్, రమ్య కృష్ణ వంటి స్టార్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus