నా వెంట ఎప్పుడూ ఇన్‌హెలర్ ఉంచుకుంటా!

  • February 10, 2021 / 10:32 AM IST

టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి కాజల్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. ఇటీవల తన ప్రియుడు గౌతమ్ ని పెళ్లి చేసుకొని.. ఇద్దరి ఫోటోలను, టూర్ పిక్స్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో తన వ్యక్తిగత, చిన్నప్పటి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్‌ ఆస్తమా ఉందని తెలిసిందని.. ఆ వయసులో ఆహరం విషయంలో తన తల్లితండ్రులు ఆంక్షలు విధించిన సంగతి తనకు ఇంకా గుర్తుందని చెప్పింది.

అంత చిన్న వయసులో ఆస్తమాతో చాలా ఇబ్బంది పడిన విషయాలను చెప్పుకొచ్చింది. ఎక్కడికైనా ట్రావెల్ చేసినా, శీతాకాలం వచ్చినా.. దుమ్ము, ధూళిలోకి వెళ్లినా ఆస్తమా లక్షణాలు మరింత ఎక్కువై ఇబ్బంది పడేదాన్ని అని తెలిపింది. అయితే ఇన్‌హెలర్స్‌ వాడడం వలన కొంత ఉపశమనం పొందేదాన్ని అని.. అందుకే ఎప్పుడూ తన వెంట ఇన్‌హెలర్ ఉంచుకుంటా అని చెప్పింది. పబ్లిక్ గా అయినా.. ప్రయివేట్ గా అయినా ఇన్‌హెలర్స్‌ ఉపయోగించడంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని కాజల్ చెప్పుకొచ్చింది.

చాలా మంది ఇన్‌హెలర్స్ వాడాలనుకుంటున్నా.. సొసైటీలో అడిగే ప్రశ్నల వలన పబ్లిక్ గా వాడలేకపోతున్నారని.. ఈ పరిస్థితి మారాలని కాజల్ పేర్కొంది. ఈ విషయం అందరికీ అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలని ‘‌#SayYesToInhalers’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన ‘మోసగాళ్లు’ సినిమా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus