బాలయ్య పాటకి కాజల్ తో పోటీపడి డాన్స్ చేసిన శ్రీలీల.!

దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ అలవాటు ఉంది. తాను డైరెక్ట్ చేసే సినిమాలు షూటింగ్ స్టేజిలో ఉంటే.. ఆన్ లొకేషన్ వీడియోలు, ఫోటోలు తీసి షేర్ చేస్తూ ఉంటాడు. అలా ముందు నుండీ తన సినిమాలకి బజ్ క్రియేట్ చేసుకోవడం అతనికి బాగా అలవాటు. అతను షేర్ చేసే వీడియోలు కూడా బాగుంటాయి. చాలా సరదాగా ఉంటాయి. విషయం ఏంటి అంటే… మొన్నటికి మొన్న అనిల్ రావిపూడి ఓ పాటకి డాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.

బాలకృష్ణ సినిమాల్లోని పాటల్లో ‘బాలయ్య బాలయ్య’ పాటకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అనిల్ రావిపూడి కూడా మంచి డాన్సర్. కాబట్టి ‘బాలయ్య బాలయ్య’ పాటకి చాలా బాగా డాన్స్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం.. అనిల్ రావిపూడి… బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లో సరదాగా తీసుకున్న వీడియోని చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇందులో అనిల్ రావిపూడి.. ని మించి డాన్స్ చేస్తున్నట్టుగా హీరోయిన్లు శ్రీలీల ,కాజల్ .. బాలయ్య పాటకి డాన్స్ చేస్తున్నారు. ‘నరసింహ నాయుడు’ సినిమాలోని ‘చిలకపచ్చ కోక’ అనే పాటకి శ్రీలీల, కాజల్ డాన్స్ చేశారు. ఇందులో కాజల్ కంటే కూడా శ్రీలీల చాలా బాగా డాన్స్ చేసిందని చెప్పాలి. ఆమె గ్రేస్ ముందు కాజల్ ఆనడం లేదు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus