Kalki 2898 AD: అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ లో అదుర్స్ అనిపిస్తున్న కల్కి.. ఏమైందంటే?

  • June 7, 2024 / 09:07 PM IST

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి(Kalki 2898 AD) మూవీ రిలీజ్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే విదేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఓవర్సీస్ లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా 4 గంటల్లోనే 4200 టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సినిమా రిలీజ్ సమయానికి బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో అదుర్స్ అనిపిస్తున్న కల్కి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మరో 3 రోజుల్లో రిలీజ్ కానున్న ట్రైలర్ తో ఈ సినిమా అసలు ప్రమోషన్స్ మొదలుకానున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కల్కి మూవీ రిలీజ్ తర్వాత కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. ఓవర్సీస్ లో ఈ నెల 26వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ కల్కి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటే మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

కల్కి 2898 ఏడీ క్రేజీ మూవీ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కల్కి సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అద్భుతమైన కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కల్కి సినిమా కథ ఏ విధంగా ఉండబోతుందో ప్రేక్షకుల ఊహలకు సైతం అందడం లేదు. మేకర్స్ మాత్రం ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కల్కి సినిమా టాలీవుడ్ రేంజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కల్కి 2898 ఏడీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus