Kamal, DSP: కమల్ హాసన్ గురించి దేవి శ్రీ ప్రసాద్ ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?

దేవీ శ్రీ ప్రసాద్ ఒకప్పుడు బిజీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కూడా బిజీ మ్యూజిక్ డైరెక్టరే.. కానీ మిడ్ రేంజ్ సినిమాలు మాత్రమే ఇతని అకౌంట్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మాత్రం ఎక్కువగా తమన్ కే దక్కుతున్నాయి. దేవి శ్రీ పని అయిపోయింది అనుకున్న టైంలో అతను.. ఒక్కో మంచి ఆల్బమ్ ఇస్తూ తన సత్తా చాటుతున్నాడు. ‘ఉప్పెన’ ‘పుష్ప’ వంటి ఆల్బమ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ సినిమా వల్ల మళ్ళీ దేవికి అవకాశాలు దక్కుతున్నాయి.

ఒకప్పుడు అయితే ఇతను ఎక్కువగా పెద్ద సినిమాలకే పనిచేసే వాడు. చిన్న సినిమాలకు చేశాడు అంటే.. ఆ సినిమా రేంజ్ ను తన మ్యూజిక్ తో ఇంకా పెంచేవాడు అనే చెప్పాలి. సరే ఇదిలా ఉండగా.. గతంలో దేవి.. తమిళ స్టార్ హీరోలతో కూడా పనిచేసేవాడు. అక్కడి స్టార్ హీరోలతో ఇతనికి మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా కమల్ హాసన్ .. మన దేవి శ్రీకి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దేవి నే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

‘2022 నుంచి మరో మంచి మెమొరీ దక్కింది. అమెరికా నుండి మన లోకనాయకుడు కమల్ హాసన్ సర్ నాకు ఈ గిఫ్ట్‌ను పట్టుకొచ్చారు. నా మీద ఆయనకు ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఆయన ఈ గిఫ్ట్ ను తీసుకొచ్చారు’ అంటూ దేవి చెప్పుకొచ్చాడు. ఇక ఆ గిఫ్ట్ విషయానికి వస్తే చేతితో తయారు చేసిన పుస్తకం, అందులో మ్యూజిక్ నొటేషన్స్.. కవర్ మీద ఆయన మాటలు, సంతకం ఉన్నాయి. ‘నా బిడ్డ.. ఇది మీ అడ్డా..’ అంటూ అందులో రాసి ఉంది.

పుష్ప పాటలోని లైన్స్ ను గుర్తుతెచ్చేలా ఇవి ఉన్నాయి. ‘నేనెంత అదృష్టవంతుడిని.. నా మీద ప్రేమ, నమ్మకాన్ని చూపిస్తున్నందుకు థాంక్యూ సర్.. కమల్ సార్ కొత్త కారులోనే నేను ఇలా ఆయనతో పాటుగా ఫోటో దిగాను.. అందులో అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉందంటూ’ దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus