Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతి సినిమాల పోరు గురించి వారానికో వార్త బయటకు వస్తోంది. ఇప్పటికి పెద్ద లిస్టే సంక్రాంతికి రెడీ అవుతున్నా.. అందులో ఆ సమయానికి ఏవి బరిలో నిలుస్తాయి అనేది చెప్పలేం. ఆ లిస్టేంటో ఆఖరులో చూద్దాం. ఇప్పుడు కోలీవుడ్‌లో మొదలైన పొంగల్‌ పోరు గురించి చూద్దాం. అక్కడ వస్తాయంటున్న సినిమాల పేర్లు, ఆ హీరోల పేర్లు చూస్తే.. మన సంక్రాంతి సినిమా లైనప్‌ కూడా కాస్త కుదుపులకు లోనవుతుంది.

Kamal – Rajinikanth

తమిళ సినిమా పరిశ్రమలో అతి పెద్ద స్టార్లు అంటే.. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ పేర్లే వినిపిస్తాయి. వారు కాకుండా ఇతర స్టార్లు ఉన్నా.. ఈ ఇద్దరూ ఓజీలే. ఇప్పుడు ఈ ఇద్దరే 2027 సంక్రాంతి పోరుకు రెడీ అవుతున్నారట. కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ నటిస్తున్న సినిమా.. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇప్పుడు పెద్ద పండగకు రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదట.

అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘ధర్మన్‌’. ఇక కమల్‌ హాసన్‌ – శంకర్‌ల పాత కొత్త సినిమా ‘ఇండియన్‌ 3’. ‘ధర్మన్‌’ షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతుండగా.. ‘ఇండియన్‌ 3’ పెండింగ్‌ పనులు షురూ చేశారట. ఇటీవల ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అయితే.. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌ అయితే బజ్‌ బాగుంటుంది.. ‘ఇండియన్‌ 2’ ఎఫెక్ట్ నుండి బయట పడొచ్చని ప్లాన్‌ చేస్తున్నారట. ‘‘ధర్మన్‌’ సంగతి కూడా అంతే అంటున్నారు.

ఇదే జరిగితే ప్రొడ్యూసర్‌ కమల్‌ వర్సెస్‌ హీరో కమల్‌గా పరిస్థితి ఉండబోతోంది. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్‌ అవుతాయి. ఇప్పటికే పొంగల్‌ బరిలో తెలుగులో శ్రీవిష్ణు – రామ్‌ అబ్బరాజు ‘ఫ్యామిలీ ప్యాక్‌’, చిరంజీవి – బాబీ ‘కాకా’, శర్వానంద్‌ – శ్రీను వైట్ల ‘జార్జ్‌ క్రిష్‌’, వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌ ‘జనవరి 12 విడుదల’తోపాటు రవితేజ సినిమా కూడా ఉంది.

‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus