మరోసారి కంగనా రనౌత్‌ ఫైర్‌

కంగన ఇక్కడ… ఓ మాట అనేముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. లేదంటే అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది. మొన్నటివరకు కంగన గురించి అందరూ ఇలానే అనుకునేవారు. అయితే ఇప్పుడు కంగన డోస్‌ పెంచింది. ఈసారి ఏకంగా మక్కెలు (ఎముకలు) ఇరగ్గొడతా అంటూ వార్నింగ్‌ ఇస్తోంది. ఈసారి కంగనా రనౌత్‌ను ఎవరు డిస్ట్రబ్‌ చేశారా? అనుకుంటున్నార. ఈసారి మేడమ్‌ కారాలు, మిరియాలు నూరడానికి కారణం ఓ రాజకీయ నాయకుడు. ఎప్పటిలాగే ఆ నాయకుడు మహారాష్ట్ర నుంచి అనుకునేరు… మధ్య ప్రదేశ్‌ నుండి.

మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ పన్సే ఇటీవల కంగనా రనౌత్‌ గురించి మాట్లాడుతూ ‘రికార్డింగ్‌ డ్యాన్సర్‌’ అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. తాజాగా ఆ కామెంట్లపై కంగన స్పందించింది. ఈ క్రమంలో దీపికా పడుకొణె, ఆలియా భట్‌ను చర్చలోకి తీసుకొచ్చింది. ‘అసలు నాపై వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తి ఎవరు?. నేనేమన్నా కత్రినా కైఫ్‌, దీపికా పడుకొణె, ఆలియా భట్‌ అనుకుంటున్నారా? ఆ విషయం ఆతనికి తెలుసా? ఐటమ్‌ సాంగ్స్‌ చేయని ఒకే ఒక్క హీరోయిన్‌ని నేనే. స్టార్‌ హీరోల సినిమాలను కూడా రిజెక్ట్‌ చేసిన హీరోయిన్‌ను నేను. అందుకే బాలీవుడ్‌లో చాలామంది నటీనటులు నన్ను వ్యతిరేకిస్తుంటారు’’ అంటూ తన గురించి ఎప్పటిలాగే చెప్పుకొచ్చింది కంగనా రనౌత్‌.

అయినా కంగనా రనౌత్‌ను ఎవరన్నా, ఏమన్నా అంటే ఆమె ఊరుకుంటుందా. సమాజంలో ప్రతిదానిపై స్పందించే కంగనా… ఆమె విషయంలో ఎందుకు స్పందించకుండా ఉంటుంది. ఇంతకీ మక్కెలిరగ్గొటడం వెనుక ఉన్న కారణమేంటంటేరా… అసలు కంగన ఏమందంటే.. ‘‘నేను ఒక రాజ్‌పూట్‌ మహిళను. నా దగ్గర వయ్యారాలు వొలికించడాలు ఉండవు. తేడా చేస్తే ఎముకలు విరగ్గొటడమే’’ అంది కంగన. ఇప్పటికైనా కంగన విషయంలో కామెంట్లు చేసేవాళ్లు వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus