కరోనా బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో మరో కథానాయిక చేరింది. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గత కొన్నిరోజుల నుండి నీరసం, కళ్ల మంటలు ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని, తాజాగా వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కంగన పేర్కొన్నారు. దీంతోపాటు ధ్యానం చేస్తోన్న ఫొటోని షేర్ చేశారు. కరోనా వచ్చిందని భయపడటం లేదని చెప్పడం ఆమె ఉద్దేశమేమో.
ఇంకా ఆ పోస్టుతో పాటు ఆమె మరికొన్ని విషయాలు రాసుకొచ్చింది. ‘‘ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. వైరస్‌ని ధైర్యంగా, బలంగా ఎదుర్కోండి. మనోధైర్యం అనే మీ బలాన్ని కోల్పోకండి. ఈ వైరస్ తన శరీరంలో పార్టీ చేసుకుంటుందేమో. మీరు భయపడితే కరోనా మిమ్మల్ని ఇంకా భయపెడుతుంది. కొవిడ్ 19 అంటే కేవలం ఒకరకమైన జలుబుగానే భావించి ధైర్యంగా ఉండండి.
అందరం కలిసి ధైర్యంగా పోరాటం చేద్దాం. ఈ చిన్న వైరస్ ను ప్రతి ఒక్కరూ నాశనం చెయ్యాలి ’’ అని కంగన పిలుపునిచ్చారు. ధైర్యంగా ఉంటేనే కరోనాను ఎదుర్కోవడం సులభమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కరోనా కూడా అదే చెబుతోంది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!