‘మాధురి ప్రజెంట్స్’ ‘పాషనేట్ ఫిలిం మేకర్స్’ మరియు ‘సినిమాటిక్ విజువల్ స్టూడియో’ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్న'(Kanna).ఎస్.ఎన్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
యువ హీరో చైతన్య రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, డైరెక్టర్ నాని కాసరగడ్డ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ క్రమంలో హీరో చైతన్య రావు మాట్లాడుతూ…”దర్శకుడు రాజశేఖర్ రెడ్డికి సినిమాపై మంచి క్లారిటీ ఉంది. టీజర్ చూస్తుంటే ఒక మలయాళ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. కార్తిక్ శివన్ పెర్ఫార్మెన్స్ ప్రామిసింగ్‌గా ఉంది. ఇలాంటి చిన్న చిత్రాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు ఎస్.ఎన్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… “మా తమ్ముడు కార్తిక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇది కేవలం క్రికెట్ చుట్టూ తిరిగే కథే కాదు, మన బాల్యాన్ని, ఊరి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ప్రతి ఊరిలోనూ ‘కన్న’ లాంటి ఒక పాత్ర ఉంటుంది. హీరోయిన్ గీతిక సహా నటీనటులందరూ ప్రాణం పెట్టి పనిచేశారు” అని చెప్పుకొచ్చారు.
హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ…”నాకు సినిమా బ్యాగ్రౌండ్ లేదు, మా నాన్నే నా బలం. ఈ సినిమా విడుదలయ్యాక అదే నా బ్యాగ్రౌండ్ అవుతుందని నమ్ముతున్నాను. క్రికెట్, లవ్, ఎమోషన్స్ కలగలిసిన ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మా టీమ్ అందరికీ ఇది ఇండస్ట్రీ ఎంట్రీ పాస్ లాంటిది” అని తెలిపారు.
హీరోయిన్ గీతికా రథన్ మాట్లాడుతూ…”ఈ సినిమాలో నేను ‘సత్య’ అనే పాత్ర పోషించాను. సినిమా చూశాక అందరూ నన్ను ఆ పేరుతోనే గుర్తుపెట్టుకుంటారు. ఇది చిన్న సినిమా అనిపించడం లేదు, చాలా క్వాలిటీగా వచ్చింది.”
డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ.. “టీజర్ ఒక ట్రైలర్ లాగా చాలా సంతృప్తిని ఇచ్చిందని, ఐపీఎల్ సీజన్‌లో ఇలాంటి క్రికెట్ బేస్డ్ మూవీ రావడం సరైన నిర్ణయమని కొనియాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ సినిమాపై ఉన్న ఇష్టంతో అసిస్టెంట్ లాగా పనిచేసి సినిమాను పూర్తి చేశామని” తెలిపారు.