‘హనీ’ ఈజ్ ది బెస్ట్ అంటూ తన క్యూట్ యాక్టింగ్‌తో కుర్రకారు మనసు దోచుకున్న పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
గత కొంతకాలంగా తన పెళ్లికి సంబంధించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు మెహ్రీన్ అధికారికంగా ప్రకటించారు.గతంలో మాజీ సీఎం మనవడితో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరిగింది.
కానీ అది పెళ్ళి పీటల వరకు వెళ్ళలేదు. ఆ ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో కూడా కారణాలు బయటకు రాలేదు. మెహ్రీన్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఆమె సీక్రెట్ పెళ్ళి వార్త ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం అవి హాట్ టాపిక్ అయ్యాయి.నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్, ఆ సినిమాలోని ‘మహాలక్ష్మి’ పాత్రతో అందరికీ దగ్గరైంది.
ఆ తర్వాత శర్వానంద్‌తో చేసిన ‘మహానుభావుడు’, రవితేజతో చేసిన ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘ఎఫ్3’ వంటి హిట్లు ఈమె ఖాతాలో పడ్డాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ‘కవచం’ ‘పంతం’ ‘చాణక్య’ ‘అశ్వద్దామ’ ‘జవాన్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం మెహ్రీన్ వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.