Kannappa: ‘కన్నప్ప’ ప్రాచీన యుద్ధాల కోసం స్పెషలిస్ట్‌ కొరియోగ్రాఫర్‌.. ఎవరంటే?

  • November 6, 2023 / 12:26 PM IST

‘భక్త కన్నప్ప’ సినిమాను మళ్లీ చేయాలని ఉంది… మంచు వారి కుటుంబం ఈ మాట ఎన్నో ఏళ్లుగా చెబుతోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో పేరు మోసిన రచయితలు, దర్శకులు పని చేశారు కూడా. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా వీలుపడలేదు. ఎట్టకేలకు ఇటీవల మంచు విష్ణు ఆ సినిమాను పట్టాలెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాలో అగ్ర నటులను భాగం చేస్తూ దూసుకెళ్తున్న విష్ణు ఇప్పుడు స్టార్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ను రంగంలోకి దించుతున్నారు.

‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. అయితే సెట్‌లో జరిగిన చిన్న ప్రమాదం వల్ల విష్ణు గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న విష్ణు త్వరలో సెట్స్‌లో అడుగుపెడతారు. అప్పుడు సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. వాటిని ‘బాహుబలి’, ‘జవాన్’లాంటి పాన్ ఇండియా సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా చేసిన కెచా హ్యాండిల్‌ చేస్తారట. ఈ మేరకు చర్చలు పూర్తయి, ఓకేలు చెప్పుకోవడం జరిగిందట.

ఇందాక చెప్పినట్లు ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నయనతార లాంటి భారీ తారాగణం ఉంది. వీళ్లు కాకుండా ఇంకొంతమంది స్టార్‌ నటులు కూడా ఉన్నారు అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కెచా లాంటి స్టార్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ను తీసుకోవడంతో సాంకేతిక నిపుణుల విషయంలోనూ భారీతనం చూపిస్తున్నారని అర్థమవుతోంది. నాటి కాలంలో వాడిన ఆయుధాలు, అప్పటి పోరాటాలు, యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

‘కన్నప్ప’ (Kannappa) సినిమా కోసం థాయిలాండ్, హాంకాంగ్ దేశాల నుంచి 80 మందికిపైగా ఫైటర్లను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారట. అక్కడే మరో నాలుగైదు నెలలు ఈ సినిమా షూటింగ్‌ ఉంటుంది అని ఇప్పటికే విష్ణు చెప్పారు. అక్కడి వాతావరణం ‘కన్నప్ప’ కాలానికి తగ్గట్టుగా ఉంటుందని అందుకే న్యూజిలాండ్‌లో షూటింగ్‌ చేస్తున్నామని విష్ణు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో జరిగే సింగిల్‌ షెడ్యూల్‌తో సినిమాను కంప్లీట్‌ చేస్తామని కూడా చెప్పారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus