అది పెద్ద సినిమా కావొచ్చు, చిన్న సినిమా కావొచ్చు.. చెప్పిన డేట్‌కి విడుదల కావడం లేదు. కారణాలేవైనా కావొచ్చు.. సినిమా అయితే రావడం లేదు. ఇలాంటి సమయంలో ఓ సీనియర్ చిన్న హీరో ఒక సినిమాను డేట్స్‌తో సహా ప్రకటించేశారు. డేట్స్ ఏంటీ అనుకుంటున్నారా? సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పారు కాబట్టి. ఆ హీరోనే సందీప్ కిషన్. ‘సూపర్ సుబ్బు’గా ఇటీవల ఓటీటీలో అలరించిన సందీప్.. త్వరలో ‘సిగ్మా’ అంటూ రాబోతున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలను అనౌన్స్ చేశారు.
ఫాంటసీ అడ్వెంచర్ జోనర్‌లో రూపొందనున్న ఆ సినిమా పేరు ‘కరికాల – ఎ మ్యాజికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. ఈ సినిమా మొదటి పార్ట్ వచ్చే ఏడాది జులై 2న విడుదల కానుంది. అదే ఏడాది అక్టోబర్ 28న రెండో భాగం రిలీజ్ చేస్తారు. అంటే ‘దురంధర్’ కాన్సెప్ట్‌లో సుమారు నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు వచ్చేస్తాయన్నమాట. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
సందీప్ ప్రస్తుత తెలుగులో ‘పవర్ పేట’ అనే పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పారలల్‌గా ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. గత ఏడాది ‘శంబాల’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు యుగంధర్ ముని. అతడి తొలి చిత్రం ‘ఎ (యాడ్ ఇన్ఫినిటమ్) మంచి ప్రయోగంగా గుర్తింపు తెచ్చుకుంది. ‘శంబాల’తో ఆది సాయికుమార్‌కి ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న హిట్ ఇచ్చారు. మరిప్పుడు సందీప్‌కి కూడా ఇస్తారేమో చూడాలి.