Chiranjeevi: చిరంజీవి సినిమాలో ఛాన్స్ దక్కిందని చెబుతున్న ఎమ్మెల్యే.. ఎవరంటే?

  • September 2, 2024 / 06:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో ఛాన్స్ అంటే వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరనే సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న వ్యక్తి సినిమాలలో ఆఫర్ ఇస్తే మాత్రం సినిమాలలో నటించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ మాత్రం చిరంజీవి సినిమాలో తనకు ఆఫర్ వచ్చిందని కామెంట్లు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రదీప్ ఈశ్వర్ తాను చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.

Chiranjeevi

చిరంజీవికి సైతం తనపై అభిమానం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో చిరంజీవి హైదరాబాద్ లోని ఇంటికి పిలిచి సన్మానం చేశారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో తాను పవన్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని ప్రదీప్ ఈశ్వర్ అన్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్నారని ఈ సినిమా పూర్తయ్యాక మొదలయ్యే చిరంజీవి సినిమాలో తాను నటిస్తానని ఆయన కామెంట్లు చేశారు.

ఆ సినిమాలో తన రోల్ ఏంటనేది భవిష్యత్తులో తెలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే విశ్వంభర తర్వాత చిరంజీవి నటించే సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సైతం అబద్ధాలు చెప్పే అవకాశం లేదు. అందువల్ల చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ గురించి త్వరలో క్లారిటీ రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి సినిమాలో ప్రదీప్ ఈశ్వర్ నిజంగానే నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

చిరంజీవి సినిమాల బడ్జెట్లు మాత్రం అంతకంతకూ పెరుగుతుండగా మెగాస్టార్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. చిరంజీవి వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వంభర సినిమాలో చిరంజీవి లుక్ అదిరిపోయిందని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ హీరోలలో చిరంజీవి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఆయన పారితోషికం 60 కోట్ల రూపాయలుగా ఉంది.

సెన్సార్ సమస్యల కారణంగా చాలా కాలం విడుదల కాకుండా ఆగిపోయిన బాలయ్య సినిమా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus