ఆగస్టు 15 న ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ కాలేదు. దానికి కారణం దర్శకుడు సుకుమారే (Sukumar) అని అంతా ముక్తకంఠంతో చెప్పారు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్..ల మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని, అందువల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా డిసెంబర్ 6 కి సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని ప్రకటించినా.. ఆ టైంకి కూడా సినిమా రిలీజ్ అవుతుందనే నమ్మకం చాలా మందికి లేదు.
మరోపక్క అల్లు అర్జున్ పై.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ లో వ్యతిరేకత కూడా నెలకొంది. ఈ అంశాలపై నిర్మాత స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ డేట్ పై.. ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘పుష్ప 2’ గురించి బయట చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మాపై ఉంది. మేమంతా పక్కా ప్లాన్‌తో ఉన్నాం. పనులన్నీ స్పీడుగా జరుగుతున్నాయి.
డిసెంబరు 6న ఎట్టిపరిస్థితుల్లోనూ ‘పుష్ష 2’ వస్తుంది.సెప్టెంబరు 2 నాటికి ఫస్టాఫ్ ఎడిటింగ్ వెర్షన్ పూర్తి అవుతుంది, అక్టోబరు 6 కి సెకండాఫ్ కూడా రెడీ అయిపోతుంది. నవంబరు 20కి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. నవంబరు 25కి సెన్సార్ కూడా కంప్లీట్ చేస్తాంఅక్టోబరులో ఒక పాట, నవంబరులో ఇంకో పాట విడుదల చేయడానికి ప్లాన్ చేస్తాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబరు 5న ప్రీమియర్లు కూడా వేయడానికి చూస్తున్నాం.
ఈ వినాయక చవితికి ఎటువంటి అప్డేట్ ఉండదు. డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తే కచ్చితంగా 2 వారాల పాటు సోలో రిలీజ్ దొరుకుతుంది. సినిమా కనుక బాగుంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకుని మా సినిమా అంటారు. బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉంది” అంటూ చాలా ప్రామిస్..లు చేసేశారు ‘మైత్రి..’ రవి శంకర్. మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా? లేక మాట దాటేయడానికి చెప్పారా? అనేది చూడాలి.