Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

అమెరికా రిటర్న్‌ పెళ్లి కొడుకుల్ని చూసుంటారు. కానీ కార్తి అమెరికా రిటర్న్‌ హీరో. (ఆయనొక్కరే కాదులెండి.. ఇంకొందరు ఉన్నారనుకోండి.) అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన సినిమాల కోసం అన్నీ వదిలేసి వచ్చేశాడు. ఆ సమయంలో ఉన్న రూపునకు ఇప్పుడు ఫేమ్‌కు ఎలాంటి సంబంధం ఉండదను అనుకోండి. అప్పట్లో ఆయన అమెరికా నుండి వచ్చాక ఏం చేసేవాడో ఈ మధ్య ఆయన అన్న సూర్య చెప్పాడు. ఆ సంగతి ఆఖరున చూద్దాం. ఇప్పుడు సినిమాల గురించి కార్తి చేసిన కామెంట్ల సంగతి చూద్దాం.

Karthi

ఒకే రకమైన కథలు మళ్లీ మళ్లీ చేయడం నాకు నచ్చదు అని చెప్పిన కార్తి.. అలా రోజూ ఒకే పని చేయాలనుకుంటే నేను నా పాత ఐటీ ఉద్యోగం చేసుకుంటూ ఆమెరికాలోనే ఉండిపోయేవాణ్ని కదా అని అన్నాడు. ప్రేక్షకులకు ఎప్పుడూ ఏదోకటి కొత్తదనం ఇవ్వాలనే ఆలోచనతోనే సినిమాలు చేస్తున్నాను అని చెప్పాడు కార్తి. అలాగే కొత్త ఆలోచనతో వచ్చిన క్రియేటర్లని (దర్శకరచయితలను) నిరుత్సాహపరచకూడదు. దర్శకుడి విజన్‌ని గౌరవించి ముందుకు వెళ్లినప్పుడే కొత్తరకమైన సినిమాలొస్తాయి అని చెప్పాడు.

ఇప్పుడు ‘సర్దార్‌ 2’ సినిమా రిలీజ్‌ చేస్తున్నారు ఓకే.. నెక్స్ట్‌ సినిమాల సంగతేంటి అని అడిగితే.. ప్రస్తుతం ‘మార్షల్‌’ సినిమా చేస్తున్నాను. 50 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని చెప్పాడు. ఆ తర్వాత ‘హిట్‌ 4’ సినిమా కోసం రెడీ అవుతా అని చెప్పాడు. ఆ సినిమా కథను శైలేష్‌ కొలను సిద్ధం చేస్తున్నారని చెప్పాడు. ఈ లోపు కల్యాణ్‌ శంకర్‌ (మ్యాడ్‌ ఫేమ్‌) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా అని కూడా చెప్పాడు.

ఇక పైన చెప్పిన సూర్య చెప్పిన కార్తి కథ సంగతి చూస్తే.. అమెరికా నుండి వచ్చాక అక్కడ అలవాటు అయినట్లే ఓ బియ్యం బస్తా లాంటి బ్యాగులో చిప్స్‌ పెట్టుకుని తినేవాడట కార్తి. అయితే ‘పరుత్తి వీరన్‌’ సినిమాలో ఛాన్స్‌ వచ్చేసరికి మొత్తం ఫిట్‌ అయిపోయి హీరో లుక్‌లోకి వచ్చేశాడు అని చెప్పాడు సూర్య. ఇదీ ఫాట్‌ టు ఫిట్‌ కార్తి కథ.

‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus