FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

అసలే విజయాలు లేవు.. తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు అనే విమర్శలూ ఉన్నాయి. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని జనాల మధ్యలోకి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ కథా నాయకుడు విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఇండియన్‌ సినిమా బాహుబలి ప్రభాస్‌ను ఢీకొట్టడానికి రెడీ అయ్యాడు. తన కొత్త సినిమాను ప్రభాస్‌ సినిమాకు పోటీగా తీసుకొస్తామని చెప్పాడు. దీంతో ఏమవుతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

FAUZI – LEGACY

విశ్వక్‌సేన్‌ హీరోగా ‘పిండం’ లాంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన సాయి కిరణ్‌ రెడ్డి దైదా రూపొందిస్తున్న సినిమా ‘లెగసీ’. ఈ సినిమాను డిసెంబ‌రు 4న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టీం ప్ర‌క‌టించింది. మామూలుగా అయితే ఇది నార్మల్‌ డేట్‌. కానీ దానికి ఒక్క రోజు ముందే అంటే డిసెంబరు 3న ‘ఫౌజీ’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న సినిమా ఇది.

ఇప్పటికే ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. హిట్‌ వైబ్స్‌ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాతో పోటీకి విశ్వక్‌ సిద్ధమవుతున్నాడు అంటే.. అయితే తన సినిమా మీద భారీగా ఉండాలి. లేదంటే ‘ఫౌజీ’ సినిమా ఆ రోజుకు విడుదల చేసే పరిస్థితి లేదు అని ‘లెగసీ’ సినిమా టీమ్‌కి తెలిసి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో విశ్వక్‌సేన్‌ అండ్‌ కో. చెప్పాలి. ఇక్కడే ఇంకో డౌట్‌ కూడా ఉంది. పెద్ద సినిమా హౌస్‌ఫుల్స్‌ తర్వాత వచ్చే రిటర్న్స్‌ తమ సినిమాకు ఉపయోగపడతాయి అని అనుకుకొని కూడా ఉండి ఉండొచ్చు.

అయితే, ఇక్కడే ఓ మాట ఉంది.. గత కొన్ని సినిమాలు ఇంకా కచ్చితంగా చెప్పాలి అంటే.. మూడేళ్ల నుండి విజయాలు లేవు. ఇప్పుడు చేస్తున్నది చాలా పెద్ద రిస్క్‌. తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలి అని కోరుకునే అందరికీ విశ్వక్‌ ఎలాంటి కంటెంట్‌ ఇస్తాడో చూడాలి.

బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus