Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

సూపర్‌ హీరో అంటున్నారు.. ప్రేమకథ అంటున్నారు.. నవ్వించడం అంటున్నారు. ఏంటీ మూడు కాంట్రడిక్షన్‌లు అనుకుంటున్నారా? మాకు కూడా ఇదే డౌట్‌. హీరో చెప్పడం వరకు ఓ సూపర్‌ హీరో కథ చేస్తున్నాను అని. అలాగే అందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది అని. ఇక డైరక్టర్‌ జోనర్‌ చూస్తే నవ్వించడంలో దిట్ట. తెలుగులో చేసిన సినిమాలు అన్నీ అలాంటివే. అయితే కేవలం నవ్వే కాదు.. కాస్త ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి.

Karthi

ఇదంతా కార్తి – మీనాక్షి చౌదరి – కల్యాణ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం కార్తి నటించి, విడుదలకు రెడీగా ఉన్న ‘సర్దార్‌ 2’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ సినిమా గురించి కూడా సమాచారం వస్తోంది. అలా ‘సర్దార్‌ 2’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆ సినిమా జోనర్‌ గురించి ప్రస్తావన వచ్చింది. సినిమా ఎలా ఉండబోతోంది అని కూడా చెప్పారు.

ఈ సినిమా ఓ సూపర్‌ హీరో చుట్టూ తిరుగుతుంది అని కార్తి చెప్పేశారు. హీరోయిన్‌ ఉంది కాబట్టి ఇద్దరి మధ్య ఓ లవ్‌ ట్రాక్‌ కూడా రన్‌ అవుతుంది అని చెప్పేయొచ్చు. అయితే ‘మ్యాడ్‌’, ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమాలను తెరకెక్కించిన కల్యాణ్‌ శంకర్ కామెడీ లేకుండా ఇప్పుడు ఓ సినిమా చేస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేయలేం. కాబట్టి ఓ సూపర్‌ ప్రేమకథ విత్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఈ సినిమా అని చెప్పొచ్చు. కార్తి 30వ సినిమా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ టార్గెట్‌ చేసుకొని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌ డేట్ చెబుతారని టాక్‌.

కార్తి చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ‘మార్షల్‌’ ఇప్పటి సెట్స్‌ మీదకు రాగా.. ‘హిట్‌ 4’ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం శైలేష్ కొలను ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. త్వరలో సినిమా ముహూర్తం జరగబోతోంది.

పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus