The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

ఎవరేం అనుకున్నా.. ఎవరెన్ని చెప్పినా.. మేం మాత్రం సెప్టెంబరు 24న వస్తాం.. అంటూ గత కొన్ని రోజులుగా ‘ది ప్యారడైజ్‌’ టీమ్‌ చెబుతూనే ఉంది. ఈ మేరకు కొత్త పోస్టర్లను రిలీజ్‌ చేస్తూనే ఉన్నారు. దీంతో ప్రేక్షకులు నమ్మాల్సి వస్తోంది. అయితే గ్రౌండ్‌ రియాలిటీ అలానే ఉందా? అంటే కాదు అనే అనిపిస్తోంది. ఎందుకంటే వారు చెప్పిన డేట్‌కి ఇంకా గట్టిగా రెండు వారాలు మాత్రమే ఉంది. ఓవర్సీస్‌ షోస్‌, ప్రీమియర్స్‌ ఉంటాయి కాబట్టి ఈ లెక్క చెబుతున్నాం..

The Paradise

ఈ టైమ్‌లో సినిమా టీమ్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న పనులేంటి అని చూస్తే.. ఒక పాటను ఇంకా షూట్‌ చేయాల్సి ఉందట. అలాగే ఓ మూడు రోజుల ప్యాచ్‌ వర్క్‌ కూడా పెండింగ్‌లో ఉందట. ఇవన్నీ చేయడానికి ఓ వారం సమయం పడుతుంది అని అనుకుందాం. అప్పుడు ఎంత సమయం మిగులుతుంది అంటే మరో వారం మాత్రమే. ఈ వారంలో సినిమా టీమ్‌ పెండింగ్‌ ఎడిటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, డీఐ, నేపథ్య సంగీతం.. ఇలా అన్నీ చేసుకోవాలి.

ఇవన్నీ పక్కన పెడితే పాన్‌ ఇండియా లెవల్‌లో ఆ హైప్‌తో రూపొందిస్తున్న సినిమా కాబట్టి.. ప్రచారం సంగతి చూడాలి. కనీసం సౌత్‌ ఇండియా అంటే చుట్టేయాల్సి వస్తుంది. అంటే చెన్నై, కొచ్చి, బెంగళూరు, విజయవాడ/ వైజాగ్‌ వెళ్లాలి. హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ పెట్టాలి. వీటన్నింటికి మరో వారం పడుతుంది. ఈ లెక్కన సెప్టెంబరు 24కి సినిమా తీసుకురావడం అంత ఈజీనా అనేదే ప్రశ్న.

కానీ నాని అండ్‌ శ్రీకాంత్‌ టీమ్‌ మాత్రం మేం కచ్చితంగా వస్తాం అనే చెబుతున్నారు. దీంతో ఏదో విషయంలో రాజీ పడకపోతే ఆ టైమ్‌కి సినిమా రావడం కష్టం అని చెప్పేయొచ్చు. లేదంటే మరోసారి వాయిదా బటన్‌ను సినిమా టీమ్‌ నొక్కాలి. చూద్దాం ఏం చేస్తారో.. ఏం చెబుతారో?

‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus